శ్రీవారి చిరు వ్యాపారస్తుల నిరసన @365రోజులు

శ్రీవారి చిరు వ్యాపారస్తుల నిరసన @365రోజులు

తిరుపతి  : శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తులకు టిటిడి న్యాయం చేయాలని కోరుతూ గురువారం టీటీడీ పరిపాలన భవనం ఎదుట దీక్షలు నిర్వహించి ఏడాదైన సందర్భంగా తలనీలాలు సమర్పించడం జరిగింది. దీక్ష చేస్తున్న శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తులు గుండు కొట్టుకొని మూడు నామాలు పెట్టుకొని వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కంగారపు మురళి, సిపిఎం జిల్లా కార్యదర్శి వి నాగరాజు మాట్లాడుతూ శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తుల పట్ల టిటిడి వ్యవహరిస్తున్న తీరు దారుణమని అన్నారు. ఏడాది పాటు దీక్షలు చేస్తున్న కూడా వ్యాపారస్తులకు న్యాయం చేయకపోవడం అన్యాయం అన్నారు. కూటమి ప్రవృతం అధికారులు వచ్చిన తర్వాత అధికార పార్టీకి చెందినవారు శ్రీవారి మెట్టు చెరువు వ్యాపారస్ తరిమి వేసి వారు వ్యాపారం చేసుకోవడం దారుణం అన్నారు. తమ పొట్టకూటి కొట్టకుండా టిటిడి ఆదుకోవాలని శ్రీవారి మెట్టు చెరువు వ్యాపారస్తులు టీటీడీ ఈవో, చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యేతో కలిసి వారి సమస్య విన్నపించినప్పటికీ వారు పట్టించుకోకుండా డ్రామాలు ఆడడం సిగ్గుచేటు అన్నారు. అక్కడ పులి సంచరిస్తా ఉందని సాకు చూపించి శ్రీవారి మెట్టు వ్యాపారస్తులు తరిమివేయడం విడ్డూరంగా ఉందన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పలుమార్లు దీక్షలు చేసిన కనీసం టిటిడి యాజమాన్యం కనికరించకపోవడం ధర్మం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఇప్పటికైనా వారి సమస్య పరిష్కరించాలని లేదంటే వారు చేసే ఉద్యమాలకు తమ మద్దతు ఉంటుందని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు టి సుబ్రమణ్యం, ఎస్ జయచంద్ర,మాధవ, లక్ష్మి, హైదరాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జయంతి, పి సాయి లక్ష్మి హాకర్స్ నాయకురాలు బుజ్జమ్మ, సిపిఎం నగర కార్యదర్శి పి వేణు, శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos