ప్రొటెం స్పీకర్‌ ఎన్నికకు నిరసనగా.

ప్రొటెం స్పీకర్‌ ఎన్నికకు నిరసనగా.

న్యూ ఢిల్లీ: 18వ లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్త పార్లమెంట్ భవనం లో ఈ సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే, ఇండియా కూటమి నేతలు రాజ్యాంగ ప్రతితో పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్రినేత రాహుల్ గాంధీ సహా కూటమి నేతలంతా రాజ్యాంగ ప్రతులతో పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ నిరసన చేపట్టారు. అనంతరం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించినందుకే నిరసన తెలుపుతున్నట్లు ఇండియా కూటమి సభ్యులు తెలిపారు. ప్రొటెం స్పీకర్ నియమించిన తీరు రాజ్యాంగ ఉల్లంఘనేనని అన్నారు. లోక్సభ ప్రొటెం స్పీకర్గా ఏడు సార్లు ఎంపీగా ఎన్నికైన భర్తృహరి మహతాబ్ను నియమించినట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల చేసిన ప్రకటనపై ఇండియా కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos