ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల పాలయ్యాయి. మదుపర్ల లాభాల స్వీకరణ ఇందుకు కారణం. ఉదయం సెన్సెక్స్ ఏకంగా 200 పాయింట్లకు పైగా ఎగబాకి 41 వేల గుర్తును దాటింది. ఇంట్రాడేలో 41,120 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. ట్రేడింగ్ ముగిసే వేళకు 68 పాయింట్లు పతనమై 40,821 వద్ద ఆగింది. నిఫ్టీ కూడా 36 పాయింట్ల నష్టంతో 12,038 వద్ద నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటాస్టీల్, ఐటీసీ షేర్లు లాభ పడ్డాయి.ఎయిర్టెల్, సన్‌ఫార్మా, టీసీఎస్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్ట పోయాయి.