ముంబై:స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్ని గడించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ ఏకంగా 500 పాయింట్లకు పైగా దూసుకెళ్లి జీవనకాల గరిష్ఠాన్ని చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ మళ్లీ 12వేల పైన నిలిచింది. సోమవారం ఉదయం నుంచి సూచీలు సాయంత్రం వరకూ లాభాల దిశగా పరుగులు తీశాయి. ఒక దశలో సెన్సెక్స్ 550 పాయింట్ల వరకు ఎగ బాకింది. మా ర్కె ట్ ముగిసే సమయానికి 530 పాయింట్ల లాభంతో 40,889 వద్ద స్థిర పడింది. నిఫ్టీ కూడా 159 పాయింట్లు దూసుకెళ్లి 12, 074 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 71.70గా దాఖలైంది. ఎన్ఎస్ఈలో ఎయిర్టెల్, భారతీ ఇన్ఫ్రాటెల్, టాటా స్టీల్, హిందాల్కో, గ్రాసిమ్ షేర్లు లాభాల్ని గడించాయి.