స్టాక్‌ మార్కెట్ల కు లాభాల బోణి

స్టాక్‌ మార్కెట్ల కు  లాభాల బోణి

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్ల ట్రేడింగ్ సోమవారం లాభాల మొదలైంది. ఉదయం 9:17 గంటలకు సెన్సెక్స్‌ 201 పాయింట్లు పెరిగి 39595 వద్ద , నిఫ్టీ 57 పాయింట్లు లాభపడి 11846 వద్ద ట్రేడ్ అయ్యాయి. 570 కంపెనీల షేర్లు లాభాల్లో, 217 కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. 50 కంపెనీల షేర్లు యథాతథంగా ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.69.02గా దాఖలైంది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యూపీఎల్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, వేదాంతా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, హిండాల్కో, జీ ఎంటర్‌టైన్మెంట్‌, యస్‌ బ్యాంక్‌, బజాబ్‌ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్‌, సిప్లా, విప్రో, ఆర్‌ఐఎల్‌, అదానీ పోర్ట్స్‌ లాభాల్ని గడించాయి. బీపీసీఎల్‌, ఐవోసీ, గెయిల్‌, టైటాన్ నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos