లాభాల విపణి

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారమూ లాభాల్ని గడించాయి. ఉదయం నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు తర్వాత కోలుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 70 పాయింట్లు లాభపడి 46,961 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 13,761 వద్ద ఆగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఇన్ఫోసిస్ (2.64%), బజాజ్ ఆటో (2.43%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.42%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.26%), టైటాన్ కంపెనీ (1.25%) లాభాల్ని పొందాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.30%), హెచ్డీఎఫ్సీ (-2.09%), ఓఎన్జీసీ (-2.07%), మారుతి సుజుకి (-1.54%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.13%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos