భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

 

ముంబై:అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో గురువారం ఉదయం దేశీయ మార్కెట్లు ఉత్సాహంగా ట్రేడింగ్‌ మొదలు పెట్టాయి. ఉదయం 9.23 సమయంలో నిఫ్టీ 121 పాయింట్లు పెరిగి 23,444 వద్ద, సెన్సెక్స్‌ 330 పాయింట్లు పెరిగి 76,937 వద్ద ట్రేడవుతున్నాయి. ఆస్ట్రా మైక్రోవేవ్స్‌, జైకార్ప్‌, జేపీ అసోసియేట్స్‌, మైక్రోటెక్‌ డెవలపర్స్‌, దిలీప్‌ బిల్డ్‌కాన్‌ షేర్ల విలువ పెరగ్గా.. మారికో లిమిటెడ్‌, ఎల్కాన్‌ ఇంజినీరింగ్‌, డాబర్‌ ఇండియా, సన్‌ టీవీ నెట్‌వర్క్‌, హిందూస్థాన్‌ యునిలీవర్‌ షేర్ల ధరలు కుంగాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos