ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్పలాభాలతో బోణీ అయ్యాయి.
ఉదయం 9.43 గంటలకు సెన్సెక్స్ 90 పాయింట్ల లాభంతో 37,626 వద్ద, నిఫ్టీ 21 పాయింట్ల లాభంతో 11,322 వద్ద ట్రేడయ్యాయి. స్పైస్ జెట్ షేర్లు ట్రేడింగ్ భారీ నష్టాలతో
ప్రారంభమయ్యాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ బోయింగ్ – 737 మాక్స్ విమానాలను నడపరాదని విమానయాన సంస్థలను ఆదేశించటమే ఇందుకు కారణం. నిఫ్టీ స్థిరాస్థి సూచీ మాత్రం 1శాతం లాభాల్లో ట్రేడయింది.