ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో వ్యాపారల్ని ఆరంభించాయి.ఉదయం పది గంటల ప్రాంతంలో బీఎస్ఈ సెన్సెక్స్ 160 పాయింట్లకుపైగా పెరిగి 39,142 వద్ద, నిఫ్టీ 60 పాయింట్లకుపైగా లాభంతో 11,578 వద్ద ఆగాయి. ఫార్మా, విద్యుత్, ఐటీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సన్ఫార్మా, పవర్గ్రిడ్ర్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఎం&ఎం, యాక్సిస్ బ్యాంక్ లాభాల్ని గడించాయి. హెచ్యూఎల్, కోటక్ బ్యాంక్, మారుతీ, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నష్టాల పాలయ్యాయి.