హీరోయిన్ అంజలికి తెలుగులోకంటే తమిళంలోనే గుర్తింపు,క్రేజ్ ఎక్కువగా దక్కింది.ఈ క్రమంలో తమిళ హీరో జైతో అంజలి ప్రేమలో ఉందని తమిళ,తెలుగు చిత్ర పరిశ్రమల్లో వార్తలు కోడై కూశాయి.ఇరువురు కలసి దిగిన ఫోటోలు సైతం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి.ఈ నేపథ్యంలో ఓ నిర్మాత అంజలి,జై గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.జై కారణంగా చాలా నష్టపోయానని నిర్మాత నందకుమార్ వెల్లడించారు.చిత్రం షూటింగ్ కోసం కొడైకెనాల్‌లో అంజలి,జైకి వేర్వేరు గదులు బుక్ చేసినా ఇద్దరూ కలసి ఒకే గదిలో ఉండేవారన్నారు.దీంతో ఒక గదిని క్యాన్సిల్ చేస్తామంటే అందుకు జై అంగీకరించలేదని దీంతో రోజుకు రూ.12వేలు చొప్పున నష్ట పోయినట్లు చెప్పారు.షూటింగ్ లో అంజలి అని పేరు పెట్టి పిలవకూడదని.. మేడమ్ అని మాత్రమే పిలవాలని జై షరతులు పెట్టేవాడన్నారు. ఎవరైనా అంజలి అని పిలిస్తే.. షూటింగ్ ఆపేస్తానని బెదిరించేవాడన్నారు. ఒక రోజు అంజలి షూట్ కు రాలేదని.. తాము ఎన్నిసార్లు ఫోన్లు చేసినా తీయలేదని.. చివరకు ఆమె కడుపు నొప్పిగా ఉందని చెప్పిందన్నారు.రూముకు కారు పంపినా రాలేదని కానీ అదేరోజు జై.. అంజలి కలిసి తాము పంపిన కారులో ఎయిర్ పోర్టుకు వెళ్లి అక్కడ నుంచి చెన్నైకి వెళ్లారన్నారు. ఈ కారణంగా షూట్ ఆపేశామన్నారు. జై తీరుతో తాను చాలా నష్టపోయినట్లుగా చెప్పారు.