బెంగళూరు : నూతన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కర్నాటక వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం ఇక్కడి చామరాజపేటలోని ఈద్గా మైదానంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన జరిగింది. స్వాతంత్య్ర సమర యోధులు దొర స్వామి తదితర ప్రముఖులు ఆందోళనలో పాల్గొన్నారు. కొన్ని వేల మంది స్థానికులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిం చారు.