రంగారెడ్డి జిల్లా బార్‌ అసోసియేషన్‌ కీలక నిర్ణయం..

రంగారెడ్డి జిల్లా బార్‌ అసోసియేషన్‌ కీలక నిర్ణయం..

పశువైద్యురాలు ప్రియాంకరెడ్డి హత్యాచారం ఘటనకు సంబంధించి రంగారెడ్డి జిల్లా బార్‌ అసోసియేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది.ప్రియాంకరెడ్డి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుల తరపున వాదించకుండా ఉండాలని బార్‌ అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుంది. శనివారం సమావేశం నిర్వహించిన బార్‌ అసోసియేషన్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.అంతే కాకుండా నిందితులకు ఉరిశిక్ష పడేంత వరకు న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకుంది. జిల్లా బార్ అసోషియేషన్ నిర్ణయాన్ని గౌరవించి ఇతర న్యాయవాదులు కూడా నిందితులకు ఎలాంటి సహాయం అందించకూడదని విజ్ఞప్తి చేశారు. ప్రియాంకరెడ్డి దారుణ ఘటన ఒక హేయమైన చర్య అని అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సహాయ నిరాకరణే సరైన నిర్ణయమని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు.మరోవైపు, ఈ కేసుకు సంబంధించి మహబూబ్ నగర్ జిల్లా బార్ కౌన్సిల్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. నిందితుల తరపున న్యాయవాదులెవరూ కోర్టులో వాదించకూడదని తీర్మానం చేసింది. నిందితులకు మరణశిక్ష పడేవరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా లాయర్లు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos