కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం..

కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం..

ప్రియాంకరెడ్డి హత్యాచారం ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.ఘటన జరిగిన మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ పట్టణవాసుల్లో ఆగ్రహం మరింత కట్టలు తెంచుకుంటోంది. ప్రియాంక రెడ్డిఘటనతో షాద్నగర్పోలీసు స్టేషన్వద్ద  తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్ గేట్ వద్దకు ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు దూసుకెళ్లారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఆందోళనకారులు రహదారిపై బైఠాయించారు. నిందితులను తమకు అప్పగించాలంటూ వారు నినాదాలు చేస్తున్నారు. ఇటువంటి మృగాళ్లకు జీవించే హక్కు లేదంటూ వాదిస్తున్నారు. పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలకు ఆటంకాలు ఎదురుకాకుండా దారి మళ్లిస్తున్నారు.నిందితులను షాద్నగర్కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కాగా ప్రియాంకపై నలుగురు కాకుండా ఐదుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. మరొకడి కోసం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos