న్యూ ఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాల్లో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి స్థానం లేక పోయినందుకు నిరసించిన రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బాసటగా నిలిచారు. ప్రధాని మోదీ ఒక దేశం-ఒకే నడత విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ చలో ఆందోళన కు పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన రైతుల్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. జల ఫిరంగులు, వాటర్ కెనన్లు, బాష్పవాయు గోళాలను ప్రయోగించి రైతులు ఢిల్లీ చేరుకోకుండా నిరోధించారు. ‘రైతుల గళాల అణచివేతకు వారిని నీటిలో తడుపు తున్నారు, ముందుకు పోకుండా ఆపేందుకు రోడ్లను తవ్వుతున్నారు. ఎంఎస్పీని పొందేందుకు చట్ట బద్ధమైన హక్కు ఉన్నట్లు ఎక్కడ రాశారో వారికి చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు కోసం శ్రద్ధచూపుతున్న ప్రధాన మంత్రి ఒక దేశం-ఒకే నడత అమలు చేయాలి’ అని ట్వీట్లో డిమాండు చేసారు.