యూనిసెఫ్ నుంచి ప్రియాంకను తొలగించాలి

యూనిసెఫ్ నుంచి ప్రియాంకను తొలగించాలి

ఇస్లామా బాద్: అంత ర్జాతీయ చిన్నారుల అత్యవసర నిధి (యూనిసెఫ్) సౌహార్ద ప్రచార కర్త బాధ్యత నుంచి నటి ప్రియాంక చోప్రాను తప్పించాలని యూనిసెఫ్ కు పాక్ మానవ హక్కుల మంత్రి షిరీన్ మజారీ కోరారు. కశ్మీర్ వ్యవహారంలో భారత ప్రభుత్వ విధానాల్ని తు.చ తప్పకుండా ప్రియాంక చోప్రా సమర్ధిస్తున్నారని ఆమె తప్పుబట్టింది. ‘పాక్పై అణుయుద్ధం ప్రకటిస్తామని భారత రక్షణ శాఖ మంత్రి చేసిన ప్రకటనను ప్రియాంక చోప్రా సమర్ధించారు. కశ్మీర్ గురించి భారత్ ప్రతి నిర్ణయానికి ప్రియాంక వత్తాసు పలుకుతున్నారు. ఇది శాంతికి మాత్రమే కాకుండా యూనిసెఫ్ విధివిధానాలకు పూర్తిగా వ్యతిరేకం. అందుకే ఆమెను యూనిసెఫ్ సౌహార్ద రాయబారి బాధ్యతల నుంచి తొలగించండి’ అని యూనిసెఫ్ కు పంపిన లేఖలో పేర్కొన్నారు. ఇటీవల భారత సైన్యానికి మద్దతుగా ‘జై హింద్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్’ అనీ ఆమె ట్వీట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos