న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ మంగళవారం లోక్‌సభలో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్‌పై చర్చ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. పెహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని ఖండించారు. బైసారన్ వ్యాలీలో ఎందుకు భద్రతను ఏర్పాటు చేయలేదని ఆమె ప్రశ్నించారు. సరైన భద్రత లేకపోవడం వల్లే అక్కడ ఉగ్రదాడి జరిగినట్లు ఆమె ఆరోపించారు. దాని వల్లే 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆమె వెల్లడించారు.