బీజేపీ రాజకీయాలను దిగజార్చుతోంది

న్యూ ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ రాజకీయాలను నానాటికీ దిగజార్చుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ విమర్శించారు. బీజేపీ తన ఎక్స్ హ్యాండిల్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫొటోను మార్ఫింగ్ చేసి రావణుడిలా మార్చింది. దీంతో రెండు జాతీయ పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రియాంక ఎక్స్ లో “ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజకీయాలను దిగజార్చుతున్నారు. హింసాత్మక ఫొటోలతో గొడవలు సృష్టించాలని చూస్తున్నారు. మీరు నిజాయతీగా, విలువలతో కూడి ఉంటామని ప్రమాణం చేశారు. ఇదేనా మీ నిజాయతీ, విలువలు?” అని ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos