ప్రయాగరాజ్ : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సోమవారం ప్రయాగ రాజ్ నగరంలోని హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి స్వామి వారిని కొలిచారు. ప్రయాగరాజ్ స్వరాజ్ భవన్ నుంచి తన కాంగ్రెస్ అనుచరులతో కలిసి బయలుదేరిన ప్రియాంక హనుమాన్ దేవాలయానికి వెళ్లారు. అనంతరం గంగా ప్రచార యాత్రలో పాల్గొనేందుకు గంగా తీరా న్నిచేరుకున్నారు. త్రివేణి సంగమానికి ప్రియాంక మూడు రోజుల పర్యటన కోసం వచ్చారు.