పాపం ప్రియ…

  • In Film
  • February 16, 2019
  • 289 Views
పాపం ప్రియ…

కేవలం ఒకేఒక్కసారి కొంటెగా కన్నుగీటి ఓవర్‌నైట్‌ నేషనల్‌క్రష్‌గా
మారిన మలయాళం చిన్నది ప్రియ ప్రకాశ్‌ వారియర్‌ పరిస్థితి అందుకు పూర్తిగా వ్యతిరేకంగా
మారిపోయింది.ఎన్నో అంచనాల మధ్య ఈనెల 14వ తేదీన థియేటర్లలోకి అడుగుపెట్టిన ఒరు అడార్‌
లవ్‌ పరమ డిజాస్టరని విమర్శకులు,ప్రేక్షకులు తేల్చేయడంతో ప్రియ పరిస్థితి పూర్తిగా
తలకిందులైంది.ప్రియకు వచ్చిన పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని ప్రియపై రూపొందించిన
సన్నివేశాలు,గీతాలను టీజర్లుగా విడుదల చేస్తూ చిత్ర దర్శక,నిర్మాతలు చిత్రానికి దేశవ్యాప్తంగా
హైప్‌ తీసుకువచ్చారు.అయితే తీరా చిత్రం విడుదలయ్యాక ప్రియకు దక్కింది ప్రాధాన్యత లేని
పాత్రకాగా అందులో కూడా కేవలం కన్ను గీటడం తప్ప ప్రియ చేసిందేమి లేదు.మరో హీరోయిన్‌కే
చిత్రంలో ప్రాధాన్యత ఉండడంతో ప్రియ అటు నటనలో కూడా పూర్తిగా తేలిపోయింది.కన్నుగీటు దృశ్యాల్లో
మినహా ఇంకెక్కడా గొప్పగా అందంగా అనిపించకపోవడం ఇలా చాలా మైనస్సులు ప్రియా వారియర్ ను రిస్క్ లో పడేశాయి. పాపులారిటీ వచ్చిన తొలి రోజుల్లోనే కాస్త తొందరపడి అవకాశాలు ఒప్పుకుని ఉంటే ఇప్పుడెలా ఉండేదో కాని దర్శకుడు ఒమర్ లుల్లు అతి తెలివి ప్లానింగ్ వల్ల ప్రియా కెరీర్ ఇప్పుడు సంకట స్థితిలో పడిందని కేరళ మీడియాలో టాక్ ఉంది. ఈ నేపధ్యంలో లవర్స్ డే మూవీని కేవలం ప్రియా వారియర్ మీద ఆసక్తితో ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రీ రిలీజ్ కు వచ్చిన బన్నీ తనతో కలిసి నటిస్తాడేమో అన్న ఊహగానాలు అప్పుడే చెలరేగాయి.ప్రియా వారియర్ సైతం గత ఏడాది బన్నీతో చేసే ఛాన్స్ మిస్ అయ్యిందని ఈసారి వదులుకోనని స్టేజి మీద చెప్పేసింది. తీరా కట్ చేస్తే లవర్స్ డే రిజల్ట్ వచ్చాక సీన్ మారిపోయింది. ఇకపై తన క్రేజ్ పెద్దగా పని చేసే అవకాశాలు లేవని తేలిపోయింది. సో బన్నీ నెక్స్ట్ మూవీలో ఛాన్స్ ఇవ్వడం జరిగే పని కాదనే చెప్పొచ్చు.  టాప్ లీగ్ పోటీ పడుతున్న తరుణంలో వింక్ బ్యూటీకి ఛాన్స్ దొరికేనా

తాజా సమాచారం

Latest Posts

Featured Videos