ప్రియా..ప్రియా..చంపొద్దే…

  • In Film
  • February 28, 2019
  • 186 Views

ప్రియ ప్రకాశ్‌ వారియర్‌ ఈపేరు వింటే చాలు యువకులు కలల్లో తేలిపోతారు.కేవలం
ఐదారు సెకన్లు ఒక్క కన్నుగీటు అంతే దేశంలోని యువకులంతా ప్రియకు ఫిదా అయ్యారు.ఒక్క టీజర్‌తోనే
ప్రియ ప్రకాశ్‌ నేషనల్‌ క్రష్‌గా మారిపోయింది. ఈ క్రమంలో ఎన్నో అంచనాల మధ్య ఇదేనెల
14వ తేదీన విడుదలైన ఒరు అడార్‌ లవ్‌ అడ్డంగా బోల్తా కొట్టినా ప్రియపై యూత్‌లో ఉన్న
క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని ప్రియ ప్రకాశ్‌ వారియర్‌ ఫోటో రుజువు చేస్తోంది. గూగుల్ లో అభిమానులు అత్యధికంగా వెతికే ఫోటో ప్రియా ప్రకాష్ దేనంటే ఆశ్చర్యం అవసరం లేదు.తాజాగా రిట్జ్ మ్యాగజైన్ ఫోటోషూట్ తో ఒక్కసారిగా మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. వంగపువ్వు రంగు గౌనులో మెరుపులు  మెరిపించేస్తోంది. మోనాలిసా తరహా వేషధారణతో కొత్తగా
కనిపిస్తూ యువకుల హృదయాలపై మరోసారి అటాక్‌ చేస్తోంది.ప్రియా రైట్ కుడిచేతిపై
ఉన్న పచ్చబొట్టు అన్నిటికంటే హైలైట్ .. అంటూ  యువకుల్లో వేడెక్కించే టాపిక్ నడుస్తోంది. శ్రీదేవి బంగ్లా సినిమా వివాదాస్పదం అయ్యింది కదా? ఇది మీకు మంచిదేనా? అని ప్రశ్నిస్తే .. వివాదాలన్నీ మా దర్శకనిర్మాతలే చూసుకుంటున్నారు. నాకెందుకని పట్టించుకోలేదు అంటూ కాస్తంత తెలివిగానే సమాధానమిచ్చింది ప్రియా… 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos