
అయోధ్య: ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత నియోజవర్గమైన వారణాసిలోని గ్రామాలను ఏ నాడూ సందర్శించలేదని కాంగ్రెస్ పార్టీ నాయకి ప్రియాంక ఆరోపించారు.శుక్రవారం ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రసంగించారు. వారణాసి నియోజక వర్గంలోని గ్రామాలను మోదీ సందర్శిం చారా అని తాను అక్కడి ప్రజలను అడిగినపుడు ఆయన ఎప్పుడూ ఇక్కడకు రాలేదని వారు వాపో యారని తెలిపారు. ఆ తర్వాత మోదీ చేసుకుంటున్న ప్రచారాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పారు. తనను ఎన్నుకున్న ప్రజలకు మోదీ ఏదైనా చేసి ఉండొచ్చని కూడా తనకు అనిపించింద న్నారు. ‘మోదీ ప్రపంచమంతా చుట్టొస్తారు. ప్రతి ఒక్కరినీ కౌగలించుకుంటారు. కానీ తన సొంత ప్రజలను మాత్రం ఆదరించరు’ అని చురకలు వేశారు.