న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులైన రాహుల్, ప్రియాంక గాంధీ ‘లైవ్ పెట్రోల్ బాంబులు’ అని హర్యానా మంత్రి అనిల్ విజ్ బుధ వారం వ్యాఖ్యానించారు. ‘వారు ఎక్కడికి వెళ్లినా మంటలు పెట్టి ప్రజల ఆస్తులకు నష్టం కలిగిస్తున్నార’ని ఆరోపించారు. నూతన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు మీరట్కు వెళ్లిన రాహుల్, ప్రియాంకగాంధీలను ఆ నగర శివార్లలోనే ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఆపి వేసిన నేపథ్యంలో అనిల్ విజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.