ఆటో ఎక్కిన యువరాజు దంపతులు

ఆటో ఎక్కిన యువరాజు దంపతులు

ఇస్లామాబాద్ : ప్రిన్స్ విలియం దంపతులు ప్రస్తుతం పాకిస్థాన్‌లో పర్యటిస్తున్నారు. ఐదు రోజుల పర్యటన నిమిత్తం ప్రిన్స్ విలియం, యువరాణి కేట్ మిడిల్టన్ వచ్చారు. తొలి రోజు పర్యటనలో భాగంగా పాక్‌లోని బ్రిటిన్ హై కమిషనర్ ఇంట్లో ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన ఆటో రిక్షాలో అక్కడికి చేరుకున్నారు. ఇందుకోసమని ఆటోను పెయింటింగ్, విద్యుద్దీపాలతో అలంకరించారు. యువరాణి ముదురు పచ్చ రంగు గౌను, సంప్రదాయ చెవి దుద్దులు ధరించి అందరి దృష్టినీ ఆకర్షించారు. యువరాజు విలియం సంప్రదాయ షేర్వాణీ ధరించారు. తొలి రోజు పర్యటనలో భాగంగా వీరు ఇస్లామాబాద్‌లోని ఓ పాఠశాలను సందర్శించి చిన్నారులకు విద్య ఆవశ్యకతను వివరించారు. వీరిద్దరూ తొలిసారిగా పాక్‌కు అధికారిక పర్యటనకు వచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos