ఎల్ఐసీ సొమ్ముల్ని ఏట్లో పోస్తున్నారు

ఎల్ఐసీ సొమ్ముల్ని ఏట్లో పోస్తున్నారు

న్యూఢిల్లీ: భారత జీవిత బీమా సంస్థ పట్ల ప్రజలకున్న గట్ట నమ్మ కాన్ని కేంద్రం ప్రభుత్వం వ్యూహాత్మకంగా దెబ్బ తీస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక్ గాంధీ శుక్రవారం ట్విట్టర్లో విమ ర్శించారు. జీవిత బీమా సంస్థ నిల్వల్ని నష్టాల పాలైన సంస్థలకు ఎందుకు వ్యయం చేస్తున్నారని ప్రశ్నించా రు. కేవలం రెండున్నర నెలల్లో ఎల్ఐసీ రూ.57 వేల కోట్ల నష్టాలను చవి చూసిందని పత్రికల్లో వచ్చిన కథనాన్ని కూడా ట్వీట్కు జత పరిచా రు. ‘భారత  దేశంలో నమ్మకానికి మరోపేరు ఎల్ఐసీ. భవి ష్యత్ భద్రత కోసం సామాన్య ప్రజలు తాము కష్టపడి సంపాదిం చుకున్న సొమ్ముల ను ఎల్ఐసీలో పెట్టుబడి పెడతారు. బీజేపీ ప్రభుత్వం మాత్రం ఆ సొమ్ములను నష్టాల్లో ఉన్న కంపెనీల కో్సం ఉపయోగించి ఎల్ఐసీ పట్ల ప్రజలకున్న విశ్వాసానికి గండి కొడుతోంద’ని మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వం విధానాలన్ని కేవలం నష్టదాయకాలని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos