న్యూఢిల్లీ: సాక్షాత్తు రాష్ట్రపతి భవన్ లోనే చోరీ జరిగింది. జోర్ బాగ్ నుంచి రాష్ట్రపతి భవవన్ కు గొట్టాలు చేరవేసేందుకు 23, 24 ప్రవేశ ద్వారాల వద్ద అరుణ్ జైన్ అనే కాంట్రాక్టర్ వాటిని ఉంచాడు. ఇవి చోరీ అయ్యాయి. అరుణ్ జైన్ ఫిర్యాదు ప్రకారం దర్యా ప్తును ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఆజంఘడ్ ప్రాంతానికి చెందిన అజయ్ అనే వ్యక్తి రాకేశ్ తివా రీ, గుడ్డు ఖాన్, మిథి లేశ్ అనే వ్యక్తులతో కలిసి చోరీ చేసాడు. వాటిని మీరట్లో విక్రయించినట్లు తేలింది. నిందితుల్ని అరెస్టు చేసా రు.