వర్షాల కోసం దీపాల పూజ

వర్షాల కోసం దీపాల పూజ

హొసూరు : వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు పెట్టే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు దేవుని వద్ద మొర పెట్టుకున్నారు. ఇందులో భాగంగా సూళగిరి తాలూకా ఉద్దనపల్లి సమీపంలోని కుర్రలపల్లిలో గ్రామ దేవతలకు దీపారాధన చేశారు. వానళ్లు కురవాలి వాన దేవుడా అంటూ వేడుకున్నారు. గ్రామానికి చెందిన మారెమ్మ, యడ్యూరప్ప, పిల్లలు దేవతా ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి అగ్ని గుండంలో నడిచారు. ఈ పూజల్లో పాల్గొనడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా తరలి వచ్చారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో ఈ ఏడాది నువ్వుల పంటను వేయనేలేదు. వేరుసెనగ విత్తనాలను సిద్ధం చేసుకున్న రైతులు, దుక్కులు దున్ని దిక్కులు చూస్తుండిపోయారు. వర్షం తక్కువగా కురిసినా బతికి బట్ట కడుతుందనే రాగి పంట కూడా కొన ఊపిరితో ఉంది. ఈ తరుణంలో భగవాన్‌ నీవే దిక్కంటూ…రైతులు ఆ దేవ దేవుని శరణుజొచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos