యువ వైద్యురాలు ప్రియాంకరెడ్డి దారుణ హత్యాచార ఘటనపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ప్రియాంకరెడ్డి తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు.ప్రియాంక ఫోన్‌లో మాట్లాడిన అనంతరం ఫోన్ కలవకపోవడం తదితర పరిణామాలన్నింటిని వివరిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయగా తమ పరిధిలోకి రాదంటూ జాప్యం చేశారని అనంతరం సీసీ టీవీల్లో వీడియోలు చూస్తూ కాలయాపన చేశారని ఆరోపించారు. అయితే… పోలీసులు మాత్రం తమ పరిధిలోకి రాదంటూ జాప్యం చేశారని ప్రియాంక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరేమో.. బాయ్ ఫ్రెండ్‌తో లేచిపోయిందేమో అంటూ అసభ్యకరంగా మాట్లాడారని కన్నీరు పెట్టుకున్నారు. పోలీసుల తీరు తమను బాధపెట్టిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.