ఫుట్‌బాల్‌తో టీమిండియా ప్రాక్టీస్

  • In Sports
  • June 21, 2019
  • 152 Views
ఫుట్‌బాల్‌తో టీమిండియా ప్రాక్టీస్

సౌతాంప్టన్‌ : ప్రపంచ కప్పులో శనివారం ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనున్న టీమిండియా ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేస్తోంది. మూడు రోజులుగా మైదానంలో ఆటగాళ్లు చెమటోడ్చుతున్నారు. ప్రాక్టీస్‌లో భాగంగా కొందరు ఆటగాళ్లు ఫుట్‌బాల్‌ ఆడుతున్నారు. బంతి కింద పడకుండా గాల్లో ఉంచడం ఓ ప్రాక్టీస్‌. ఈ వీడియోను బీసీసీఐ పోస్టు చేసింది. ప్రాక్టీస్‌ సందర్భంగా ఆటగాళ్లు బంతిని 41 సార్లు గాలిలోనే ఉంచారు. మరో వైపు గాయపడిన విజయ్‌ శంకర్‌ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జట్టు యాజమాన్యం ప్రకటించింది. పాయింట్ల్ పట్టికలో అయిదో స్థానంలో ఉన్న భారత జట్టు మరో అయిదు మ్యాచులు ఆడాల్సి ఉంది. జూన్‌ 30న ఇంగ్లండ్‌తో జరిగే పోటీయే కీలకం. తర్వాత బంగ్లాదేశ్‌, శ్రీలంక, వెస్టిండీస్‌లతో తలపడాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి టీమిండియా సెమీస్‌లోకి ప్రవేశించడం ఏమంత కష్టం కాదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos