వైసీపీలోకి ఆదాల…!

ఆదాల ప్రభాకర రెడ్డి

నెల్లూరు :  తెలుగుదేశం పార్టీ నాయకుడు
ఆదాల ప్రభాకర రెడ్డి వైసీపీలో చేరబోతున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. తొలి
నుంచి ఆయన నెల్లూరు లోక్‌సభ స్థానాన్ని ఆశిస్తున్నారు. అయితే  పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు నెల్లూరు
రూరల్‌ శాసన సభ స్థానాన్ని కేటాయించారు. అప్పటి నుంచే ఆదాల పార్టీ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో
ఉన్నారు. శుక్రవారం ఉదయం ఆయన ప్రచారాన్ని కూడా నిర్వహించారు. తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
వైసీపీ ఆయనకు లోక్‌సభ స్థానం టికెట్టు ఇవ్వజూపిందని, దీంతో ఆయన ఆ పార్టీలో చేరడానికి
ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం. దీనికి తగినట్లుగానే ఆయన అనుచరులు ఆదాల కార్యాలయం
వద్ద ఉన్న టీడీపీ ఫ్లెక్సీలను తొలగించారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos