తెలుగు రాష్ట్రాలకు పవర్ కట్

తెలుగు రాష్ట్రాలకు పవర్ కట్

దిల్లీ: దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక‌ రాష్ట్రాలకు ఫిబ్రవరి 9 నుంచి విద్యుత్‌ సరఫరాను నిలిపేయాలని ఎన్టీపీసీ భావిస్తోంది. దీనికి సంబంధించి ‘విద్యుత్‌ సరఫరా నియంత్రణ’ నోటీసులను ఎన్టీపీసీ ఆయా రాష్ట్రాలకు జారీ చేసింది. గత రెండు నెలల పైబడి బకాయిలు చెల్లించకపోవటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీపీసీ తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి రూ.7,859కోట్ల బకాయిలు పెండింగ్‌లు ఉన్నాయని ఎన్టీపీసీ వెల్లడించింది. ఇందులో అగ్ర భాగం రూ. 4,890 కోట్లు బకాయిలు కేవలం ఈ మూడు రాష్ట్రాల నుంచే రావాల్సి ఉందని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్‌ తర్వాతి స్థానంలో ఉందన్నారు. కేంద్ర విద్యుత్‌ శాఖ పోర్టల్‌లో పేర్కొన్న సమాచారం మేరకు.. ఎన్టీపీసీకే కాకుండా ఇతర విద్యుత్ సరఫరా కంపెనీలకు ఉత్తరప్రదేశ్‌ రూ. 6,127 కోట్లు బకాయి పడింది. రాజస్థాన్‌ రూ.2404 కోట్లు, పంజాబ్‌ రూ.1,041 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos