ఎప్పుడూ వినోదభరితమైన కథలను .. సందడి చేసే పాత్రలను ఎంచుకునే ‘అల్లరి‘ నరేశ్, ఈ సారి విభిన్నమైన కథను .. విలక్షణమైన పాత్రను ఎంచుకున్నాడు. కొంతసేపటి క్రితం వదిలిన ‘నాంది‘ ఫస్టులుక్ పోస్టర్ ను చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. పరిచయమై దశాబ్ధం పైగా కెరీర్ ని సాగించిన నరేష్ రొటీన్ కామెడీ చిత్రాలు చేసినా అప్పుడప్పుడు ప్రయోగాలతో మెప్పించాలని ట్రై చేశాడు. కానీ ప్రతిసారీ దుర దృష్టమే అతడిని వెంటాడింది.అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా అతడు ప్రయోగాల బాటను వదల్లేదు. వీలు చూసుకుని ప్రయోగాలకు సిద్ధమవుతున్నాడు.అల్లరి నరేశ్ నటిస్తున్న కొత్త చిత్రం నాంది పోస్టర్ అందుకు సింబాలిక్. ఈ పోస్టర్ లో నరేష్ లుక్ అభిమానులకు షాకిస్తోంది.దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ ఇవ్వగా, ముహూర్తపు సన్నివేశాన్ని అల్లరి నరేశ్ పై చిత్రీకరించారు. సతీశ్ వేగేశ్న నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా, విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకమైన పాత్రను పోషిస్తోంది. హరీశ్ ఉత్తమన్ .. ప్రియదర్శి .. ప్రవీణ్ .. వినయ్ వర్మ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇంతవరకూ 56 సినిమాలను పూర్తి చేసిన అల్లరి నరేశ్, ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందని భావిస్తున్నాడు.