సెప్టెంబరు 1 నుంచి రిజిస్టర్డ్ పోస్ట్‌కు సెలవు

సెప్టెంబరు 1 నుంచి రిజిస్టర్డ్ పోస్ట్‌కు సెలవు

న్యూ ఢిల్లీ:భారత తపాలా శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. టీచర్లు, లాయర్లు, ఉద్యోగులు, ఉద్యోగార్ధులు, విద్యార్థులు, గ్రామీణ ప్రజలతో 50 ఏళ్లకుపైగా అనుబంధం కలిగిన రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీసులపై కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి ఆ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీసును ఇకపై స్పీడ్ పోస్టులో విలీనం చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో అత్యంత చౌకగా, విశ్వసనీయతకు మారు పేరుగా నిలిచిన ఈ సర్వీసులు మనకు గుడ్​బై చెప్పబోతున్నాయి. ఇకపై రిజిస్టర్డ్ పోస్ట్ తరహా ఫీచర్లు కలిగిన సర్వీసును ఇంకో పేరుతో స్పీడ్ పోస్టు అందించనుంది. అయితే, ఈ మార్పుతో ఎవరిపై ఎక్కువ ప్రభావం పడుతుంది? ఎవరికి ప్రయోజనకరంగా ఉంటుంది? అనేది తెలుసుకుందాం. వేగవంతమైన తపాలా సర్వీసుల కోసం స్పీడ్ పోస్ట్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని భారత తపాలా శాఖ నిర్వహిస్తోంది. పోస్ట్‌ను డెలివరీ చేసినట్టుగా ధ్రువీకరణ, పోస్ట్ ట్రాకింగ్, అడ్రస్ ప్రకారం కచ్చితత్వంతో పోస్ట్ డెలివరీ అనేవి రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీసులోని ప్రధాన ఫీచర్లు. వీటిని కలిగిన తపాలా సర్వీసును ప్రస్తుతం స్పీడ్ పోస్ట్ కూడా అందిస్తోంది. ఇలాంట ప్పుడు రిజిస్టర్డ్ పోస్ట్‌ను ఇంకా కొనసాగించడం అనవసరం అని తపాలా శాఖ భావించింది. రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీసును స్పీడ్ ‌పోస్ట్‌లో విలీనం చేసింది. అందుకే సెప్టెంబరు 1 నుంచి ఈ సేవను ఇండియా పోస్ట్ అందించలేదు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos