అలనాటి నటి గీతాంజలి కన్నుమూత..

  • In Film
  • October 31, 2019
  • 156 Views
అలనాటి నటి గీతాంజలి కన్నుమూత..

తెలుగుతో పాటు దక్షిణాదిలోని అన్ని భాషల్లో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను ఆలరించిన ప్రముఖ నటి గీతాంజలి గురువారం తుదిశ్వాస విడిచారు.కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ అపోలో హస్పిటల్లో చికిత్స పొందుతున్న గీతాంజలి గురువారం కన్నుమూశారు. గీతాంజలి మృతి వార్తతో తెలుగ అన్నిభాషల నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.1957లో కాకినాడలో జన్మించిన గీతాంజలి 1961లో ఎన్టీఆర్తో సీతారామ కళ్యాణం చిత్రంతో చిత్ర సీమకు పరిచయమయ్యారు.తెలుగుతో పాటు తమిళం,కన్నడ,మలయాళం,హిందీ భాషల్లో సైతం నటించి గొప్ప నటిగా కీర్తిప్రతిష్టలు పొందారు.నటి గీతాంజలికి అలనాటి హీరో,నటుడు రామకృష్ణతో వివాహం జరిగింది.రామకృష్ణ కూడా ప్రముఖు నటుడనే విషయం తెలిసిందే. 2007లో పెళ్లైన కొత్తలో చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన గీతాంజలి తాజాగా నటించిన చిత్రం దటీజ్ మహాలక్ష్మీ త్వరలో విడుదల కానుంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos