దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వారణాశి, మరో పుణ్య క్షేత్రం- పూరి నుంచి పోటీ చేయనున్నట్లు తెలిసింది. గత లోక్‌సభ ఎన్నికల్లో మోదీ వడోదర, వారణాశి నుంచి పోటీ చేసి రెండు చోట్లా గెలిచారు. కానీ వారణాశికే లోక్‌సభలో ప్రాతినిధ్యాన్ని వహించి సొంత రాష్ర్ట నియోజక వర్గానికి దూరమయ్యారు. రాను న్న లోక్‌సభ ఎన్నికల్లో పూరీ నుంచి కూడా ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి .నరేంద్ర మోదీ ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరి నుంచి పోటీ గురించి స్పందించ లేదు. ఆ వార్తలను కొట్టి పారేయనూ లేదు. భాజపా పార్లమెంటరీ బోర్డు కూడా మోదీ మరోసారి వారణాసి స్థానం నుంచే పోటీ చేసి మరో సారి విజయాన్ని సాధిస్తారని ఆశిస్తోంది. దీనికి తోడుగా పూరీ నుంచి కూడా పోటీ చేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.