తారక్‌పై పూనమ్‌ ట్వీట్‌ వైరల్‌..

  • In Film
  • May 22, 2020
  • 172 Views
తారక్‌పై పూనమ్‌ ట్వీట్‌ వైరల్‌..

హీరోయిన్‌గా దక్కని గుర్తింపు పూనమ్‌ కౌర్‌కు పవన్‌ కళ్యాణ్‌పై ప్రత్యక్షంగా,పరోక్షంగా ట్వీట్లు చేయడం ద్వారా దక్కింది.అవకాశాలు లేకపోవడంతో షాపుల ఓపెనింగులు,ఫోటోషూట్‌లతో కాలం వెళ్లదీస్తున్న పూనమ్‌ పవన్‌కళ్యాణ్‌,దర్శకుడు త్రివిక్రమ్‌పై చేసిన ట్వీట్‌తో పాపులరైంది.తాజాగా తారక్‌ పుట్టినరోజు సందర్భంగా పూనమ్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. అతని ప్రమేయం లేకుండా, అతని తప్పులు లేకుండా చిన్నతనం నుంచి పెద్దయ్యే వరకు తిరస్కరణకు గురయ్యాడు.. ఆయన ప్రయాణం పట్ల నాకెంతో అపారమైన గౌరవం ఉంది.. స్వర్గంలో ఉన్న ఆయన తాత, ఎంతో మంది సహృదయుల ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉంటాయి.. బెస్ట్ విషెస్’ అని పేర్కొంటూ హార్ట్ సింబల్స్‌ను షేర్ చేసింది పూనమ్. అయితే కామెంట్ సెక్షన్స్‌లో తారక్ ఫ్యాన్స్ అందరూ థ్యాంక్యూ పూనమ్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజా సమాచారం