పూలదండలతో నిందితుడికి పోలీసుల స్వాగతం..

పూలదండలతో నిందితుడికి పోలీసుల స్వాగతం..

చట్టాలను,న్యాయశాఖను,పోలీసు శాఖను లోకువగా చూస్తూ నిర్లక్ష్యంగా వ్యహరించే వ్యక్తులను ప్రతిరోజు చూస్తూనే ఉంటాము.అయితే పోలీసులు జారీ చేసిన వారెంట్ పై గౌరవంతో ఒక వ్యక్తి సుమారు 1400 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించి పోలీసు స్టేషన్ కు చేరుకోవడం మధ్యప్రదేశ్ లోని నాగ్ ఝీరిలో వెలుగు చూసింది.మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి చెందిన ముకేశ్ కుమార్ అనే యువకుడు పెళ్లి చేసుకుని బీహార్ లోని సీతామడిలో సెటిలయ్యాడు. 2014లో ముకేశ్ కుమార్ కు, ఓ బంధువుకు మధ్య వివాదం జరిగింది. దీనిపై ఉజ్జయిని నాగ్ ఝురీ పీఎస్ లో పోలీసు కేసు నమోదైంది. ఈ కేసు నిమిత్తం పోలీసులు ముఖేశ్ కుమార్ కు వారెంట్ జారీ చేశారు. కానీ ముకేశ్ కుమార్ స్పందించలేదు.దాంతో పోలీసులు ముఖేశ్ మధ్యప్రదేశ్ లో ఉండటంలేదు బీహార్ సెటిల్ అయ్యాడని తెలిసి అక్కడి అడ్రస్ తెలుసుకుని పర్మినెంట్ వారెంట్ జారీ చేశారు. వెంటనే పోలీస్ స్టేషన్ కు రావాలని వారెంట్ లో స్పష్టం చేశారు.పోలీసుల నుంచి వచ్చిన వారెంట్ చూసిన ముకేశ్ కుమార్ వెంటనే ఉజ్జయిని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ సరైన ప్రయాణసౌకర్యం లేదు. తన ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రమే. దీంతో వేరే దారి లేక బీహార్ నుంచి ఉజ్జయినీకి సైకిల్ పై సెప్టెంబర్ 29న సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించాడు.బీహార్ లోని సీతామడి నుంచి నాగ్ ఝీరి వెళ్లేందుకు బయల్దేరాడు. మధ్యలో ఖర్చుల కోసం అక్కడక్కడా కూలిపనులు చేసుకుంటూ ఆ డబ్బులతో తింటూ..అలా 1,400 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ ప్రయాణించి నాగ్ ఝీరి చేరుకున్నాడు. అలా ముఖేష్ సైకిల్ ప్రయాణ 10 రోజులు పట్టింది. అక్టోబర్ 9కు నాగ్ ఝీరి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు.అలా వారెంట్ చూసి ఎంతో కష్టపడి..ప్రయాసతో పోలీస్ స్టేషన్ కు వచ్చిన ముకేశ్ కుమార్ ను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆపై పూలదండ తెప్పించి అతడి మెడలో వేసి స్వాగతం పలికారు. వారెంట్ పట్ల అతడి నిబద్ధత, చట్టం పట్ల అతడి గౌరవానికి పోలీసులు ఫిదా అయ్యారు.దీనిపై పోలీసు అధికారి సంజయ్ వర్మ మాట్లాడుతూ..ముకేశ్ పై ఉన్న కేసు నిమిత్తం అతన్ని కోర్టులో హాజరుపర్చుతామని..కోర్టు ఏం చెబితే అది అమలు చేస్తామని..అదే సమయంలో ముఖేశ్ పోలీస్ స్టేషన్ కు సరెండర్ కావటానికి ఎంత ప్రయాసపడి వచ్చాడో న్యాయస్థానానికి వివరించుతామని తెలిపారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos