కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి

కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి

భోపాల్: గుణా జిల్లా, అరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందారని హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఇక్కడ వెల్లడించారు. మృతులు సబ్ ఇన్స్పెక్టర్ రాజ్కుమార్ జాదవ్, ఇద్దరు కానిస్టేబుళ్లు నీలేశ్ భార్గవ, శాంతారామ్ మీనా. ‘ కొందరు దుండగులు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారంతో అరోన్ స్టేషన్ పరిధిలోని ఘటనా స్థలానికి పోలీసు బృందం వెళ్లింది. పోలీసులు చుట్టు ముట్టినపుడు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. వారిని త్వరలోనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటాం. రెండు జింక కళేబరాలు, 5 తలలు, ఒక నెమలి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నాం. వారు వేటగాళ్లలా తెలుస్తోంద’ని వివరించారు. దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు పోలీసుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos