పోలవరంపై బాంబ్ పేల్చిన కేంద్రం

పోలవరంపై బాంబ్ పేల్చిన కేంద్రం

ఢిల్లీ: పోలవరంపై కేంద్రం మరో బాంబ్ పేల్చింది. సవరించిన డీపీఆర్ అనుమతుల కోసం తమ దగ్గర పెండింగ్లో లేవని కేంద్రం చెప్పింది. రాజ్యసభలో వైకాపా సభ్యుడు విజయ సాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి షెకావత్ బదులిచ్చారు. ‘2011-19లోనే సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపాం. వైసీపీ అధికారంలోకి వచ్చాక సవరించిన డీపీఆర్ను సమర్పించలేదన్నా’రు. సవరించిన అంచనాల ప్రకారం రూ.54 వేల కోట్లు ఆమోదించాలని, ఇటీవల కేంద్ర మంత్రిని వైసీపీ ఎంపీలు కోరారు. సవరించిన అంచ నాలను ఆమోదించామని, ఆర్థికశాఖకు పంపుతామని కేంద్ర మంత్రి తెలిపారని ఎంపీలు మీడియా సమవేశంలో పేర్కొన్నారు. 2013-14 అంచనా వ్యయం రూ.20, 39 8.61 కోట్లకే పరిమితమవు తామని, ఆ తర్వాత పెరిగే అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలం టూ కుండబద్దలు కొట్టింది. పోలవరం సాగు నీటి పథకవ 2017-18 అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు లేక సవరించిన అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లకు కేంద్రం బాధ్యత వహించదని పరోక్షంగా తేల్చి చెప్పింది. నిధుల విష యంలోనే కాకుండా డయాఫ్రమ్ గోడ, ఎగువ, దిగువ కాఫర్డ్యామ్ల నిర్మాణ విన్యాసాల మార్పులను కేంద్ర జల సంఘం ఆమోదిస్తే తప్ప నీటి పథకం నిర్వహణలోనికి రాదని కరాఖండిగా చెప్పింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos