ఎమ్మెల్యేపై ఉన్న కోపాన్ని,కక్షను ప్రత్యర్థులు ఎమ్మెల్యే పెంపుడు కుక్కలపై చూపారు.ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుక్కులకు విషం పెట్టి హతమార్చారు.తమిళనాడులోని సేలం జిల్లా వీరపాండి ఎమ్మెల్యే మనోన్మణి పనమరత్తుపట్టి యూనియన్ పారపట్టిలో ఉంటున్నారు. తన కుటుంబసభ్యులతో కలిసి ఓ ఆలయానికి వెళ్లి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చారు. తాము పెంచుకుంటోన్న మూడు పెంపుడు శునకాలు మృతిచెంది ఉండడం చూసి షాకయ్యారు.వాటికి విషమిచ్చి వాటిని చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఎమ్మెల్యే ఇంటి ఆవరణలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ ఎమ్మెల్యే పెద్ద కుమారుడు పనమరత్తుపట్టి యూనియన్ కౌన్సిలర్ పదవికి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు ఆయనను బెదిరించడానికే ఈ ఘటనకు పాల్పడ్డారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.