రూ.15 లక్షలు గల్లంతు

రూ.15 లక్షలు గల్లంతు

న్యూ ఢిల్లీ : పంజాబ్‌ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) ఖాతాదారుల నగదు స్వాహా అయిపోతున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేవలం మూడు రోజుల వ్యవధిలో 61 మంది వినియోగదారుల ఖాతాల నుంచి సుమారు రూ.15 లక్షలు గల్లంతు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్ 8 న తన ఖాతానుంచి తన ప్రమేయం లేకుండానే గుర్తు తెలియని లావాదేవీ జరిగిందని ఒక ఖాతాదారు పీఎన్‌బీ వసంత్ విహార్ బ్రాంచ్ మేనేజర్కు ఫిర్యాదు చేసారు. బ్యాంకు అధికారులు దీన్నిపోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఫిర్యాదుదారుల జాబితా మరింత పెరిగింది. బ్యాంకు ప్రకటన ప్రకారం మొత్తం 14, 97,769 రూపాయల సొమ్ము అక్రమార్కుల జేబులోకి వెళ్లిపోయింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని వసంత్ విహార్ డీసీపీ(సౌత్‌ వెస్ట్‌) దేవేందర్‌ ఆర్యా వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos