ప్రధానికి ఇసుమతైనా బాధ లేదు…

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి
తప్పు చేస్తున్నామని,మోసం చేసామనే బాధ ఇసుమంత కూడా లేదంటూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు.బుధవారం తెదేపా నేతలతో టెలీకాన్ఫరెన్స్‌
నిర్వహించిన చంద్రబాబు మాట్లాడారు.రాష్ట్రంలో నెలకొన్న ఏసమస్యకైనా పరిష్కారం
తెదేపా ద్వారా మాత్రమే సాధ్యమన్నారు.ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని లూటీ
చేస్తున్నారని అందుకు రాష్ట్రం నుంచి వైకాపా కూడా మద్దతిస్తోందని ఆరోపించారు.తాను
చేసిన తప్పులను తెదేపాపై రుద్దడానికి వైకాప అధినేత జగన్మోహన్‌రెడ్డి
ప్రయత్నిస్తున్నారని వైకాపా తప్పుడు ప్రచారాలు,ఆరోపణలు తెదేపా నేతలు ఎక్కడిక్కడ
అడ్డుకోవాలని సూచించారు.పేదలకు,రైతులకు తెదేపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన
సంక్షేమ,అభివృద్ధి పనులే ఎన్నికల్లో శ్రీరామరక్ష కానున్నాయన్నారు.తెదేపాపై ప్రజలకు
ఏర్పడ్డ విశ్వసనీయత ఇప్పటికిప్పుడు వచ్చింది కాదని దశాబ్దాల క్రితమే తెదేపాపై
ప్రజలకు నమ్మకం ఏర్పడిందన్నారు.ఐదు కోట్ల ప్రజల్లో పార్టీ నిబద్ధతపై నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. కార్యకర్తల బాధ్యత తాను తీసుకుంటానని.. పనిచేసే అందరికీ గుర్తింపు లభిస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేసిన పనులపై 80 శాతం సంతృప్తి ఉందని, పార్టీ పట్ల కూడా ప్రజల్లో 80 శాతం మద్దతు ఉందని చంద్రబాబు అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos