న్యూ ఢిల్లీ : కరోనా సంక్షోభంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ బుధవారం చేసిన ట్వీట్ లో విమర్శించారు. ‘21 రోజుల్లో కరోనాను ఓడిస్తామని గాలిలో మేడలు కట్టడం, ఆరోగ్య సేతు యాప్.. ప్రజలను రక్షిస్తుందని చెప్పడం, రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ, మన భూభాగాన్ని ఎవరూ ఆక్రమించలేదు.. అంతా నియంత్రణలోనే ఉంది’.. అని ఇలా భాజపా అబద్ధాలు చెప్పింది. అయితే వీటన్నంటిలోనూ ఒక నిజం మాత్రం ఉంది. అదే ‘ఆపదలో అవకాశం’ #పీఎం కేర్స్ ’అని దుయ్యబట్టారు.