పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు

పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు

న్యూ ఢిల్లీ: బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు… ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధరలు పెరిగాయి. ఒక్కో సిలిండర్ పై రూ. 14 పెంచారు. ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1,769.50కి చేరుకుంది. స్థానిక పన్నులను బట్టి ఈ ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఇప్పటి నుంచి సిలిండర్ బుక్ చేసుకునే వారు పెరిగిన ధరను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, గృహ అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరలను మాత్రం పెంచలేదు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను చివరిసారిగా మార్చ్ 1వ తేదీన మార్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos