హాపూర్: ఇక్కడ కరోనా చరిత్రను పునరావృతం చేసింది. మనుషుల మధ్య భౌతిక దూరం స్థానిక న్యాయవాది – ముకుల్ త్యాగి వినూత్నంగా ఆలోచించి ఏకంగా చెట్టుపైన ఆవాసానిన ఏర్పచు కున్నారు. నివాసంగా మార్చుకుని కాలం గడుపుతున్నారు. హాపూర్ సమీంలోని అశోధ గ్రామంలో చెట్టుపై కట్టెలు, గడ్డితో మంచె నిర్మించుకున్నారు. నిచ్చెన సాయంతో దానిపైకి ఎక్కి పుస్తకాలు చదువుతూ, హాయిగా నిద్ర పోతూ కాలాన్ని గడిపుతున్నారు. తన కుమారుడి సహాయంతో చెట్టుపై మంచె నిర్మించినట్లు చెప్పారు. ‘చెట్టుపై ఇల్లు కట్టుకోవాలని మా నాన్న ఆలోచించారు. ఎండిన చెట్ల కొమ్మలను సమానంగా నరికి వీటిని తాడు సహా యంతో సమాంతరంగా కట్టాము. దానిపై గడ్డివేసి మంచెలా తయారు చేశాం. చెట్టుపై కట్టడం గొప్ప అనుభూతి. ఇక్కడ ఉంటే ప్రకృతికి దగ్గరగా ఉన్నట్ల నిపిస్తుంది. కాలుష్యం లేకుండా హాయిగా ఉంది. ఈ అనుభూతిని ఎంతో ఆస్వాదిస్తున్నాను’ అని త్యాగి కుమారుడు అన్నారు. వేళకు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికే భోజనం వస్తోందని ముకుల్ తెలిపారు. ‘చరిత్ర పునరావృతం కావడం’ అంటే ఇదేనేమో అంటూ స్థానికులు వ్యాఖ్యానించారు.