మైదానంలో బంగ్లా ఆటగాళ్ల అతి..

  • In Sports
  • February 10, 2020
  • 208 Views
మైదానంలో బంగ్లా ఆటగాళ్ల అతి..

అండర్‌ 19 ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్‌-భారత్‌ జట్ల మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ విజేతగా నిలిచింది.బంగ్లా బౌలర్ల ధాటికి భారత్‌ 177 పరుగులకే కుప్పకూలగా అనంతరం ఛేదనకు దిగిన బంగ్లా మధ్యలో కొద్దిగా తడబడ్డా తిరిగి పుంజుకొని విజయం సాధించి మొదటిసారి ప్రపంప కప్పును సొంతం చేసుకుంది.ఈ నేపథ్యంలో మైదానంలో బంగ్లా ఆటగాళ్లు చేసిన అతిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ముఖ్యంగా పేస్ బౌలర్ షరిఫుల్ఇస్లామ్, టీమిండియా ఆటగాళ్లపై అనవసర వ్యాఖ్యలు చేశాడు. మరో ఆటగాడు తిడుతూ, గొడవకు దిగాడు. సమయంలో భారత ఆటగాళ్లు కూడా దీటుగా బదులిచ్చేందుకు ముందుకు రావడంతో షరీఫుల్ కిందపడ్డాడు. వెంటనే కల్పించుకున్న అంపైర్లు ఇరు జట్ల మధ్యకూ వచ్చి, గొడవను సద్దు మణిగేలా చేశారు. విజయానికి అవసరమైన సింగిల్రాగానే.. డగౌట్లో ఉన్న ఆటగాళ్లంతా ఉద్వేగంతో ఒక్కరిగా మైదానంలోకి దూసుకొచ్చారు. అలా వస్తూనే భారత ఆటగాళ్లను గేలి చేస్తున్నట్టుగా అరిచారు. ముఖ్యంగా పేసర్షోరిఫుల్ఇస్లాం రెచ్చిపోయాడు. భారత ఆటగాళ్లపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసి కవ్వించాడుమైదానంలో బంగ్లాదేశ్ఆటగాడు ఏకంగా గొడవకు దిగాడు. భారత క్రికెటర్ని నెట్టివేసాడు. అక్కడే ఉన్న అంపైర్జోక్యం చేసుకోకోవడంతో గొడవ సద్దుమణిగింది. మరోవైపు డగౌట్నుంచి భారత కోచ్పారస్మాంబ్రే భారత ఆటగాళ్లు అందరినీ రమ్మని సైగ చేశాడు.అందుకు సంబంధించి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos