హెలికాఫ్టర్లల్లో ధనాన్ని తరలిస్తున్న భాజపా

అమరావతి: ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా హెలికాఫ్టర్ల ద్వారా ధనాన్ని తరలిస్తోదని ఆంధ్రప్రదేశ్‌ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ రావు పరోక్షంగా ఆరోపించారు.గురువారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ల ద్వారా నగదు తరలిస్తున్నారని భాజపా నాయకులు చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. ‘భాజపా ఇలాంటి పనులు చేస్తోంది కాబట్టే వారికి ఈ తరహా ఆలోచనలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా భాజపా 273 హెలికాఫ్టర్లు వాడుతున్నట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింద’ని పేర్కొన్నారు. తెదేపాకు వ్యతిరేకంగా ఎన్నికల సంఘానికి తరచూ ఫిర్యాదులు చేయటం భాజపాకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. కనీసం ధరావత్తయిన తెచ్చుకోవాలని కోరితే కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ఎద్దేవా చేసారు. ‘నేను ఎప్పుడూ ఎన్నికల్లో పాల్గొనలేదని, ఇక పై పాల్గొంటానని గానీ ఎక్కడా చెప్పలేద’ని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యకు స్పందించారు. నిరుద్యోగం ఎక్కువగా ఉన్న దేశంలో వృద్ధి రేటు ఏడు శాతమనటం పెద్ద అబద్ధమని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ చెప్పారని గుర్తు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos