‘పీకే’తో కమల్ మంతనాలు

‘పీకే’తో కమల్ మంతనాలు

చెన్నై:వచ్చే శాసన సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు సాధనకు మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ ఎన్నికల వ్యూహకర్తగా పేరు గాంచిన ప్రశాంత్ కిశోర్తో మంతనాలు సాగించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విజయాలకు ప్రశాంత్ కిశోర్ ఎత్తు గడలు కారణమనేది అందరికీ తెలిసిందే. తమిళనాట త్వరలో స్థానిక సంస్థలకు, 2021లో శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లను ప్రజలను ఆకట్టుకొనే వ్యూహ రచన గురించి వారిద్దరూ సుమారు రెండు గంటల పాటు చర్చించినట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల దృష్ట్యా అన్నాడీఎంకే పార్టీ కూడా కిశోర్ సంప్రదింపులు జరుపుతుండటం విశేషం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos