కోల్కత్తా: పశ్చిమ బంగ శాసనసభ ఎన్నికల్లో భాజపా 200 సీట్లు గెలుచుకోని పక్షంలో తాము పదవులకు రాజీనామా చేస్తామని చెప్పాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మంగళవారం ఇక్కడ పశ్చిమ బంగ కమలనాధులకు సవాల్ విసిరారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక దేశంలో ఒక ఎన్నికల వ్యూహకర్త కథ కంచికి వెళ్తుందని ప్రశాంత్ కిషోర్ను ఉద్దేశించి భాజపా ఎద్దేవా చేసింది. ఎన్నికల్లో డబుల్ డిజిట్ దాటితే తాను ట్విటర్ నుంచి తప్పు కుంటా నంటూ ట్వీట్ చేశాడు. ఇది సంచలనమైంది.