రైల్వేలు బలోపేతం

రైల్వేలు బలోపేతం

ఢిల్లీ : లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రైల్వేలను బలోపేతం చేసేలా ఉందని కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ అన్నారు. పదేళ్లలో రైల్వేలో దాదాపు 50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా బడ్జెట్‌ రూపకల్పన జరిగిందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారన్నారు. బడ్జెట్‌ 130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందన్నారు. బడ్జెట్‌పై కాంగ్రెస్‌ విమర్శలను కొట్టి పారేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ప్రవేశ పెట్టిన ఒక్క బడ్జెట్‌ కూడా ప్రజలను మెప్పించలేకపోయిందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos