కాన్పుర్ : స్థానిక అత్తరు వ్యాపారి పీయూష్ జైన్‌కు చెందిన స్థలాల నుంచి మరో రూ.10 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కన్నౌజ్‌లోని ఫ్యాక్టరీ, పీయూష్ నివాసం నుంచి రూ.ఐదేసి కోట్లు స్వాధీనం చేసినట్లు అధికార్లు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు స్వాధీనం చేసిన నగదు విలువ రూ.187.45 కోట్లకు చేరింది. పన్ను ఎగవేత నేరారోపణపై పీయూష్‌ను అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. చందన తైలం,అత్తరు వంటి ఉత్పత్తులను స్వాధీనం చేసు కున్నట్లు చెప్పారు. తొలి రోజు తనిఖీ చేస్తున్న సమయంలో పీయూష్ తన ఇంటి నుంచి పారిపోయాడని అధికారులు తెలిపారు. అనంతరం పలుమార్లు ఫోన్లు చేయగా రెండు గంటల తర్వాత తిరిగి వచ్చారని చెప్పారు. పీయూష్ సమాజ్‌వాదీ పార్టీ నేత కూడా. ఇటీవల సమాజ్ వాదీ సెంట్ పేరుతో రూపొందించిన సుగంధ ద్రవ్యాన్ని ఇటీవల తయారు చేశారు. గుజరాత్, ముంబయిల్లో కూడా అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.